విజయవాడలో మహా దారుణం !!

 విజయవాడ నగరంలోని చిట్టినగర్ ప్రాంతంలో పది రూపాయల కోసం జరిగిన చిన్న గొడవ చివరికి దారుణ హత్యగా దారితీయడం కలకలం సృష్టిస్తోంది. మద్యం కోసం రూ.10 ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు మరొక వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఏ వ్యవహారం స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.


అసలేం జరిగిందంటే..

స్థానిక భీమన బాపయ్యవీధి కొండ ప్రాంతంలో తెన్నేరు పాండు జ్యోతి కుమారుడు.. 19 ఏళ్ల దుర్గాప్రసాద్ ఎలక్ట్రికల్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రోజున ఇంట్లో అన్నయ్య సిగరెట్ తాగుతుండగా దుర్గాప్రసాద్ అతడిని మందలించాడు. ఈ విషయంపై కుటుంబంలో వాగ్వాదం జరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దుర్గాప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లి చిట్టినగర్‌లోని ఓ బార్‌లో మద్యం సేవించాడు.

రూ.10 అడిగినందుకు చెంపదెబ్బ..


మరోసారి మద్యం తాగాలనే ఉద్దేశంతో దుర్గాప్రసాద్‌కు రూ.10 అవసరమైంది. ఈ క్రమంలో చిట్టినగర్‌కు చెందిన 48 ఏళ్ల పలకా తాతాజీని డబ్బు అడిగాడు. అయితే తాతాజీ డబ్బు ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా, దుర్గాప్రసాద్ చెంపపై కొట్టాడు. ఈ ఘటనతో యువకుడు తీవ్రంగా కోపగించాడు. దీంతో వెంటనే వేరొకరి వద్ద నుంచి డబ్బు తీసుకుని మళ్లీ మద్యం సేవించాడు. ఆపై ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని.. అర్ధరాత్రి సమయంలో చిట్టినగర్ సొరంగ మార్గంలోని షాపు వరండాలో నిద్రిస్తున్న తాతాజీ వద్దకు వెళ్లాడు. నిద్రలో ఉన్న తాతాజీ ఛాతీలో కత్తితో పొడిచి హత్య చేశాడు. సంఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు.

వల్లభనేని వంశీపై మాచవరం పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు

 గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ (Vallabhaneni Vamsi Mohan) కు బిగ్ షాక్ తగిలింది. గతంలో వివిధ కేసుల్లో జైలు జీవితం గడిపి విడుదలైన ఆయనపై మరోసారి కేసు నమోదైంది.



విజయవాడ పోలీసులు వైసీపీ నేతపై ఈ కొత్త కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. వంశీ తో పాటు మరో ఎనిమిది మందిపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా వంశీ వరుస వివాదాలు, కేసులను ఎదుర్కొంటున్న తరుణంలో, తాజా ఫిర్యాదు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. దీంతో ఈ కేసులో వంశీని మరోసారి జైలుకు తరలిస్తారా లేదా అని సోషల్ మీడియాలో జోరుగా చర్చించుకుంటున్నారు.

నవదంపతుల మృతిలో షాకింగ్ వీడియో..రైలులో గొడవ

వంగపల్లి వద్ద మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో పడి మృతి చెందిన నవదంపతుల కేసులో షాకింగ్ వీడియో బయటపడింది. ప్రమాదానికి ముందు వారు రైలులో గొడవ పడిన దృశ్యాలు ఇప్పుడు అనుమానాలకు తావిస్తున్నాయి.

విధాత: వంగపల్లి-ఆలేరు రైలు మార్గంలో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి కోరాడ సింహాచలం (25), భవాని (19) అనే నవ దంపతులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే వారి మరణానికి ముందు రైలులో దంపతులు ఇద్దరు గొడవ పడినట్లుగా ఓ వీడియో వెలుగులోకి రావడంతో ఈ సంఘటన మరో మలుపు తీసుకుంది. గొడవ నేపథ్యంలోనే రైలు ప్రమాదం జరిగిందా? లేక ఆత్మహత్యనా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


అంతకుముందు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం(25)కు, అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని(19)తో రెండు నెలల క్రితం వివాహమైంది. సింహాచలం హైదరాబాద్‌లో ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తుండగా జగద్గిరిగుట్టలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు దంపతులు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌ నుంచి గురువారం రాత్రి బయలుదేరారు. రైలు వంగపల్లి రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత డోర్‌ వద్ద నిలబడి ఉన్న ఇద్దరూ జారిపడి మృతిచెందారు. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ట్రాక్‌మెన్‌ గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రైల్వే జీఆర్పీ ఇన్‌ఛార్జి కృష్ణారావు తెలిపారు. ఇప్పుడు నవదంపతులు ఇద్దరు చనిపోవడానికి ముందు రైలులో గొడవ పడిన వీడియో వెలుగు చూడటంతో కేసు కొత్త మలుపు తీసుకుంది.

Gazette notification | 6 జోన్లు.. 2 మల్టీ జోన్లు..

Gazette notification | ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : 26 జిల్లాల ఆధారంగా కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆర్డర్‌-1975 ప్రకారం ఉన్న జోనల్‌ నిబంధనలను కేంద్రం సవరించింది.

ప్రత్యక్ష నియామకాల్లో స్థానికత కేడర్‌, జోనల్‌, మల్టీ జోన్ల పై స్పష్టతనిస్తూ గెజిట్‌ విడుదల అయింది. 7 ఏళ్లు ఒకే చోట చదివిన ప్రాంతాన్ని స్థానికంగా పరిగణలోకి తీసుకుంటారు. వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Gazette notification


మల్టీ జోన్‌-1 :

జోన్‌-1 : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాలు.

జోన్‌-2 : అల్లూరి సీతారామరాజు, తూ.గో., కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలు.

జోన్‌-3 : ప.గో., ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలు.


మల్టీ జోన్‌-2 :

జోన్‌-4 : గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు..

జోన్‌-5 : తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలు..

జోన్‌-6 : నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలు.

బాత్రూం డోర్‌ కొట్టిందని మోకాళ్లపై కూర్చోబెట్టిన టీచర్‌

 మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని టాయిలెట్‌కు వెళ్లేందుకు బాత్రూం డోర్‌ కొట్టిందని మోకాళ్లపై కూర్చోబెట్టిన సంఘటనపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.

గత నెల 17న జిల్లా కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుకు దిక్కు లేకుండా పోయింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించినట్లుగా పేర్కొంటూ క్లోజ్‌ చేయడంతో తిరిగి విద్యార్థిని తల్లిదండ్రులు సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు.

Guntur


గుంటూరు నగరం పట్టాభిపురంలోని జీకేఆర్‌ హైస్కూల్ ల్లో 3వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అర్జంటుగా టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడంతో పాఠశాలలోని బాత్రూంకు వెళ్లింది. అయితే బాత్రూం ఖాళీ లేకపోవడంతో లోపల ఉన్న వారిని త్వరగా బయటకు రావాలని పిలిచేందుకు తలుపు తట్టింది. ఈ సంఘటన గమనించిన పాఠశాలలోని ఒక టీచర్‌ విద్యారి్థని పెద్ద తప్పిదం చేసినట్లుగా భావించి, చెంపపై దెబ్బ కొట్టడంతోపాటు మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఈ విధంగా గంటన్నర సేపు విద్యారి్థని మోకాళ్లపై కూర్చునట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనంతరం జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్యం వాగ్వాదానికి దిగింది. బాలిక తల్లి సంకు త్రిలోచనకు ముగ్గురు పిల్లలు కాగా, ఇదే పాఠశాలలో చదువుతున్నారు.


ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి వారిని పాఠశాలకు రానివ్వకుండా యాజమాన్యం అడ్డుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరపాల్సిన విద్యాశాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పాఠశాలకు వెళ్లి విచారణ జరపాల్సిన అధికారులు ఇవేమీ చేయకుండానే ఫిర్యాదు పరిష్కరించామని చెప్పి ఫిర్యాదును మూసివేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో తల్లిదండ్రులు మళ్లీ ఫిర్యాదు చేసేందుకు సోమవారం గ్రీవెన్స్‌కు వచ్చారు. గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించినట్లుగా జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీం బాషా పేరుతో సంబంధిత విద్యార్థిని తల్లికి పోస్టులో లేఖ పంపారు. విద్యారి్థని తల్లిదండ్రులు ఇచ్చిన సెల్‌ఫోన్‌కు పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదని లేఖలో పేర్కొన్నారు.

Guntur: బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి, అసభ్యకర ఫొటోలు తీసి..

 Guntur: బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి, అసభ్యకర ఫొటోలు తీసి..

Guntur girl drugs


ఇన్‌స్టా పరిచయాలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఎందరో ప్రాణాలు తీసుకోగా, మరెన్నో కుటుంబాల్లో అల్లకల్లోలానికి దారితీస్తున్నది. ఇక్కడా ఆ కుటుంబాన్ని అగాథంలోకి నెట్టివేసింది.

తేరుకుంటుందో, మరేదైనా ప్రమాదం చోటుచేసుకుంటుందో తెలియని అయోమయ పరిస్థితి ఆ కుటుంబంలో నెలకొన్నది. ఇలాంటి పరిస్థితి మరో కుటుంబంలో జరగకూడదని పలువురు మానసిక విశ్లేషకులు కోరుకుంటున్నారు.


Guntur: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు పట్టణంలోని ఓ కళాశాలలో ఓ బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. అదే కళాశాలలో చదివే ఓ సీనియర్ విద్యార్థి ఆమెకు ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇదే సమయంలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ ఆ యువకుడు నమ్మించాడు. ఈ సమయంలో ఆమెకు తెలియకుండానే ఆమెకు డ్రగ్స్ అలవాటు చేశాడు. ఈ సందర్భంగా ఆమెతో అసభ్యంగా తాను ప్రవర్తించి వీడియోలు తీసుకున్నాడు.


Guntur: ఆ బాలిక కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆమె ఫోన్‌ను పరిశీలించగా నిర్ఘాంతపోయారు. కళ్లు బైర్లు కమ్మేసినంత పనైంది. ఓ యువకుడితో తన కూతురు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను చూసి తల్లి మందిలించింది. దీనికి ప్రతిగా తల్లిపైనే ఆ బాలిక దాడి చేసింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించసాగింది.


Guntur: ఎటూ తోయని ఆ మాతృమూర్తి మనస్తాపానికి గురైంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈ సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. డ్రగ్స్ కోణంలో సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును డ్రగ్స్ ముగ్గులోకి దించి, అసభ్య వీడియోలు, ఫొటోలు తీసి అల్లరి చేసిన ఆ దుండగుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆ కుటుంబంతోపాటు స్థానికులు కోరుతున్నారు.

ఎల్లారెడ్డిలో ఓడిన అభ్యర్థి కుటుంబాన్ని ట్రాక్టర్ తో ఢీకొట్టి

 కామారెడ్డి: ఓడిన అభ్యర్థి కుటుంబంపై ట్రాక్టర్ తో ఢీకొట్టారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట గ్రామంలో జరిగింది.

ఎల్లారెడ్డిలో ఓడిన అభ్యర్థి కుటుంబాన్ని ట్రాక్టర్ తో ఢీకొట్టి


తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజును ట్రాక్టర్ తో కాంగ్రెస్ అభ్యర్థి పాపయ్య సోదరుడు ఢీకొట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, తనను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి మరి దాడి చేశాడు. తన అన్న కుమారుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిబాబా అండతోనే ఈ దారుణానికి బాబాయి పాపయ్య సోదరుడు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఇంటి ముందు కూర్చున్న బిఆర్ఎస్ అభ్యర్థిని, అతని అనుచరులను, కుటుంబ సభ్యులను ట్రాక్టర్ తో కాంగ్రెస్ అభ్యర్థి ఢీకొట్టాడు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బిఆర్ఎస్ అభ్యర్థి, అతని అనుచరులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రెండు గంటలుగా రాస్తారోకో కొనసాగుతుంది. ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు.



విజయవాడలో మహా దారుణం !!

 విజయవాడ నగరంలోని చిట్టినగర్ ప్రాంతంలో పది రూపాయల కోసం జరిగిన చిన్న గొడవ చివరికి దారుణ హత్యగా దారితీయడం కలకలం సృష్టిస్తోంది. మద్యం కోసం రూ.1...